కాకతీయ. కొత్తగూడెం రూరల్: సైబర్ ఫ్రాడ్‌లపై ప్రజలకు సత్వర సహాయం కల్పించేందుకు 1930 హెల్ప్‌లైన్ నంబరు అందుబాటులో ఉందని కొత్తగూడెం జిల్లా సైబర్ క్రైమ్ డిఎస్పి బి అశోక్ కుమార్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పదమైన ఆన్‌లైన్ లింకులు, కాల్స్‌కు స్పందించకూడదని, ఫ్రాడ్ అవుట్‌లను నివారించేందుకు 1930 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉందన్నారు. ప్రజలందరూ గమనించి, అనుమానాస్పదమైన కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు లేదా సంబంధిత హెల్ప్‌లైన్లకు సమాచారం ఇవ్వాలని అన్నారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గురువారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ని కార్యాలయ సిబ్బంది, అధికారులకు సైబర్, డ్రగ్స్ నియంత్రణలపై సైబర్ క్రైమ్ డీఎస్పీ బి అశోక్ అవగాహన కల్పించారు.


