బాల్య వివాహాలపై అవగాహన
కాకతీయ,మణుగూరు : బాల్య వివాహాల నిర్మూలన మన అందరిపైన ఉందని,సమాజాన్ని బాల్య వివాహాల రహితంగా తీర్చిదిద్దుట మనందరి బాధ్యతని గ్రేస్ మిషన్ స్కూల్ ఇంచార్జి పుల్లారావు అన్నారు.శనివారం మణుగూరు మండలంలోని స్థానిక గ్రేస్ మిషన్ పాఠశాలలో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (AID) సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం విద్యార్థిని విద్యార్థులతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని,బాల్య వివాహాలు నివారించడం మన అందరి బాధ్యతని,ప్రజలలో చైతన్యం కలిగించాలని దానికి విద్యార్థిని విద్యార్థులు కూడా పాలుపంచుకోవాలని సూచించారు.ఆడ పిల్లలకు చిన్న వయసులో పెళ్ళిళ్లు చేసి వారి యొక్క అభివృద్ధిని వారి యొక్క విద్యా హక్కును కాలరయడం క్షమించరాని నేరమన్నారు.అలా బాల్య వివాహాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మల్లేశ్వరరావు,పాఠశాల సెక్రటరీ జెట్టి స్వామి,ఎయిడ్ సంస్థ ప్రతినిధి నాగుల జ్యోతి పాల్గొన్నారు.



