కుష్ఠు వ్యాధి నిర్ధారణపై అవగాహన
రావులపల్లిలో ప్రత్యేక కార్యక్రమం
కాకతీయ, తుంగతుర్తి : తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్ఠు వ్యాధి నివారణ, నిర్ధారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వైద్యాధికారి డా.లింగమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఎల్‌సీడీసీ కుష్ఠు వ్యాధి కేసుల అనుమానిత నిర్ధారణ కార్యక్రమం గురించి వివరించారు. ప్రతి ఇంటికీ ఆశ కార్యకర్తలు వెళ్లి స్పర్శ లేని రాగి రంగు మచ్చలను గుర్తించాలని తెలిపారు. కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించి ఎమ్‌డీటీ చికిత్స అందిస్తే పూర్తిగా నయం అవుతుందని పేర్కొన్నారు. వ్యాధి నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుల పట్ల ప్రజలు వివక్ష చూపకుండా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ ఆరోగ్య విస్తరణ అధికారి రవికుమార్, ఎంఎల్‌హెచ్‌పీ డా.విజయ్‌కుమార్, ఫార్మసిస్ట్ శోభారాణి, లెప్రసీ నోడల్ పర్సన్ గాజుల సోమన్న, హెల్త్ అసిస్టెంట్ నరసింహాచారి, ఎల్‌డీ కంప్యూటర్ ఆపరేటర్ నవీన్‌కుమార్, ఏఎన్‌ఎంలు భారతి, స్వప్న, రజిత, కమల, స్వాతి, రూప, మౌనిక, ఆఫ్రిన్, శైలజమణి, నాగలక్ష్మి, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


