epaper
Monday, March 2, 2026
epaper

గిరిజనుల జామాయిల్ పంటపై దాడి

గిరిజనుల జామాయిల్ పంటపై దాడి
ధ్వంసానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామంలో గిరిజనులు పండించిన జామాయిల్ పంటను అక్రమంగా ధ్వంసం చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, గట్టుమల్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 112, 113, 114, 115, 116లలోని ప్రభుత్వ సీలింగ్ భూములను 1974లో సమగ్ర సర్వే నిర్వహించి, 1976లో అప్పటి ప్రభుత్వం 18 మంది గిరిజనులకు 54 ఎకరాల భూమిని (ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు చొప్పున) పట్టాలుగా కేటాయించిందని తెలిపారు. అప్పటి నుంచి గిరిజనులు ప్రభుత్వ పట్టాలతోనే వ్యవసాయం చేస్తూ, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందుతూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

పంట ధ్వంసం.. బెదిరింపులు..
ఈ భూముల్లో గిరిజనులు జామాయిల్ పంట వేసుకొని మొదటి క్రాప్ కోత పూర్తిచేసిన తర్వాత, రెండో క్రాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో స్థానిక గిరిజనేతర వ్యక్తి చెరుకుమల్ల వెంకట నరసయ్య నేతృత్వంలో వచ్చిన వ్యక్తులు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం అక్రమంగా సుమారు ఒక ఎకరం జామాయిల్ పంటను నరికివేసి ధ్వంసం చేశారని ఆరోపించారు. దీనిని ప్రశ్నించిన గిరిజనులను చంపుతామని బెదిరించడం అప్రజాస్వామిక చర్యగా వారు తీవ్రంగా ఖండించారు. గిరిజనుల పంటలను ధ్వంసం చేసిన వారిపై ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు గిరిజన సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నా రక్షణ కరువు
ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ గిరిజన భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టుమల్ల గ్రామ ఘటన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు సమగ్ర భూ సర్వే నిర్వహించి, పట్టాదారులైన గిరిజనులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు పట్టాలు ఎలా వచ్చాయో విచారణ చేయాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ పట్టాలు జారీ అయ్యాయని ఆరోపించారు. ఆ అక్రమ పట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

న్యాయం జరగకపోతే ఆందోళన తీవ్రత
గిరిజనులకు న్యాయం చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షతో పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాటోత్ కృష్ణ, పూనం నాగేశ్వరరావు, బానోతు ధర్మ, వాంగ్డోత్ సురేష్ తదితర నాయకులు, గిరిజన రైతులు కుంజా లక్ష్మయ్య, పడిగ సీతయ్య, బండా వెంకటేశ్వర్లు, పడిగా రాజారావు, శెట్టిపల్లి భాగ్యమ్మ, వాసం సావిత్రి, బట్టు వీరబాబు, బట్టు బాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img