బంగ్లాదేశ్‌లో జేమ్స్ కచేరీపై దాడి
ఫరీద్‌పూర్‌లో మూకల హింస… 25 మందికి గాయాలు
ఢాకా : బంగ్లాదేశ్‌లో ప్రసిద్ధ రాక్ గాయకుడు ఫారుక్ మహ్‌ఫుజ్ అనమ్ జేమ్స్ నిర్వహించాల్సిన సంగీత కచేరీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో రద్దైంది. ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలోని ఫరీద్‌పూర్‌లో శుక్రవారం రాత్రి కచేరీ వేదిక వద్ద మూక దాడికి పాల్పడింది. స్థానిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరగాల్సిన ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే కొందరు వ్యక్తులు బలవంతంగా వేదికలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాళ్లు, ఇటుకలు, కుర్చీలతో ప్రేక్షకులపై దాడి చేయడంతో 25 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో నిర్వాహకులు భద్రతా కారణాల దృష్ట్యా కచేరీని రద్దు చేశారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


