కాకతీయ, భద్రాచలం : వైద్యం కోసం వచ్చిన మహిళతో ఎక్స్ రే తీసే వంకతో అసభ్యంగా ప్రవర్తించిన దారుణ ఘటన భద్రాచలంలో వెలుగులోకి వచ్చింది. ఒరిస్సా నుండి వైద్యం కోసం వచ్చిన ఓ మహిళా రోగి పట్ల ల్యాబ్ టెక్నిషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు.
భద్రాచలం బస్టాండ్ వెనుక గల ఓ ప్రముఖ ప్రయివేట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్ రే తీయాలనే వంకతో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సదరు మహిళా ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికి వాళ్ళు పట్టించుకోలేదని వాపోయింది.
దీంతో చేసేదేమీ లేక.. మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నట్టు సమాచారం. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


