epaper
Thursday, January 15, 2026
epaper

ఆకలికి‘అటల్’ చెక్‌

ఆకలికి‘అటల్’ చెక్‌
ఢిల్లీలో రూ.5కే భోజనం
వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రారంభం
తొలి విడతలో 45 చోట్ల ప్రారంభమైన అటల్ కాంటీన్లు
రోజుకు రెండు పూటల భోజనం.. ఒక్కో కేంద్రంలో 500 మందికి సేవలు
డిజిటల్ టోకెన్, సీసీటీవీ నిఘాతో పారదర్శక పంపిణీ

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ఆకలితో అలమటిస్తున్న పేదలు, కూలీలు, తక్కువ ఆదాయ వర్గాలకు భరోసా కల్పించేలా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ‘అటల్ కాంటీన్’ పథకాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు. ఈ పథకం కింద పోషకాహారంతో కూడిన పూర్తి భోజనం కేవలం రూ.5కే అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. “అటల్ కాంటీన్ ఢిల్లీ ఆత్మగా మారుతుంది. ఎవ్వరూ ఆకలితో నిద్రపోకూడదు” అని పేర్కొన్నారు. పేదలకు గౌరవప్రదంగా భోజనం అందించడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు.

తొలి దశలో 45 కేంద్రాలు

ప్రస్తుతం ఢిల్లీలో ఆర్కే పురం, జంగ్‌పురా, షాలిమార్ బాగ్, గ్రేటర్ కైలాస్, రాజౌరీ గార్డెన్, నరేలా, బవానా తదితర ప్రాంతాల్లో 45 అటల్ కాంటీన్లు ప్రారంభమయ్యాయి. మిగతా 55 కాంటీన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కాంటీన్లలో రోజుకు రెండు పూటల భోజనం అందించనున్నారు. మధ్యాహ్న భోజనం: ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
రాత్రి భోజనం: సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి భోజనం అందించనున్నారు. భోజనంలో బియ్యం, పప్పు, కూరగాయ, చపాతీ, పచ్చడి ఉంటాయి.

డిజిటల్ టోకెన్, సీసీటీవీ నిఘా
భోజన పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం డిజిటల్ టోకెన్ విధానాన్ని అమలు చేస్తోంది. మాన్యువల్ కూపన్లకు బదులుగా ఈ విధానం ఉపయోగించనున్నారు. అలాగే అన్ని కాంటీన్లను డీయూఎస్‌ఐబీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా సీసీటీవీ కెమెరాలతో ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తారు. మొత్తంగా, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పేదలకు కడుపు నింపే ఈ పథకం ఢిల్లీలో సామాజిక భద్రతకు కొత్త దిశ చూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img