చేర్యాల ఎస్సైగా అపూర్వరెడ్డి
కాకతీయ, చేర్యాల: చేర్యాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సైగా అపూర్వరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజల ఫిర్యాదులపై త్వరితగతిన స్పందిస్తూ, న్యాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ వేముల నవీన్ గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్ళారు.


