కాకతీయ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఈ రోజు (శుక్రవారం) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగనున్నాయి. అలాగే, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనున్నారు.
ఇక జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, జనవరి 23న పర్యావరణ పరిరక్షణ పరీక్ష జరగనున్నాయి. ప్రాక్టికల్స్ విషయానికి వస్తే, ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సాధారణ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 13న సమగ్ర శిక్షా ఒకేషనల్ ట్రేడ్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
ఏపీ ఇంటర్ 2026 పరీక్షల షెడ్యూల్ వివరాలు..
ఫిబ్రవరి 23: మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
ఫిబ్రవరి 24: రెండో సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
ఫిబ్రవరి 25: మొదటి సంవత్సరం ఇంగ్లీషు పేపర్ 1
ఫిబ్రవరి 26: రెండో సంవత్సరం ఇంగ్లీషు పేపర్ 2
ఫిబ్రవరి 27: మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ 1
ఫిబ్రవరి 28: రెండో సంవత్సరం హిస్టరీ/ బోటనీ పేపర్ 2
మార్చి 2: మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 1
మార్చి 3: రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2
మార్చి 5: మొదటి సంవత్సరం జూవాలజీ/ మ్యాథ్స్ 1బి
మార్చి 6: రెండో సంవత్సరం జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2
మార్చి 7: మొదటి సంవత్సరం ఎకనామిక్స్ 1
మార్చి 9: రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2బి
మార్చి 10: మొదటి సంవత్సరం ఫిజిక్స్ 1
మార్చి 11: రెండో సంవత్సరం ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2
మార్చి 12: మొదటి సంవత్సరం కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1
మార్చి 13: రెండో సంవత్సరం ఫిజిక్స్ 2
మార్చి 14: మొదటి సంవత్సరం సివిక్స్ 1
మార్చి 16: రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2
మార్చి 17: మొదటి సంవత్సరం కెమిస్ట్రీ 1
మార్చి 18: రెండో సంవత్సరం కెమిస్ట్రీ 2
మార్చి 20: మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1
మార్చి 21: రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2
మార్చి 24: మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1


