సాధన కాలేజీలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం
కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారి రోహిత్ రాజు ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల కేంద్రంలోనీ సాధన జూనియర్ కాలేజీలో చైతన్యం యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్సై బి.రవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ శ్రీలక్ష్మి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అనైతిక కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అని అన్నారు, అనంతరం ఎస్సై బి.రవి మాట్లాడుతూ ఒకప్పుడు మహా నగరంలో వినిపించేటువంటి మాదకద్రవ్యాలు డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటయ్యే యువత నేడు చాప కింద నీరు లాగా డ్రగ్స్ గంజాయి లాంటి పదార్థాలు నేడు పల్లెల్లోకి చేరుకున్నాయని, గంజాయి మాదకద్రవ్యాలను సులువుగా రవాణా చేసుకొని నేడు విద్యార్థులకు యువతకు చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నారని ముఖ్యంగా ఇలాంటి కేసులు ఎన్నో మా దృష్టికి వచ్చాయని గంజాయి అలవాటు పడిన వ్యక్తి ఎంతటి నేరానికైనా వెనుకాడడని ఆ మత్తులో ఏమి చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంటారని ఈ అలవాటున్న వ్యక్తి అనేక రోగాలకు బారిన పడతారని కాబట్టి యువకులు, విద్యార్థులు ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఎల్లప్పుడూ మంచి మార్గంలోనే నడవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కాలేజీ సిబ్బంది, నరసింహారావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.


