కాంగ్రెస్ పార్టీలో తీరని లోటు
సీనియర్ నాయకులు భట్టు పాంట్యా కు పితృవియోగం
కాకతీయ,కామేపల్లి: కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మండల కేంద్రంలోని గరిడేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత సొసైటీ డైరెక్టర్ భట్టు పాంట్యా తండ్రి భట్టు లాల్య (85)వృద్ధాప్య కారణాలతో గురువారం ఉదయం కన్నుమూశారు.
నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
లాల్య మరణవార్త తెలియగానే మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్యాంట్యా నివాసానికి చేరుకున్న పలువురు నాయకులు లాల్య భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సేవా గుణం కలిగిన వ్యక్తిగా గుర్తింపు: లాల్య తన జీవిత కాలంలో ఎంతో మందికి అండగా నిలిచారని, ఆయన క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శమని పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
కుటుంబానికి పరామర్శ: పితృవియోగంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న భట్టు పాంట్యా వారి కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సంతాప సభ
స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ “పాంట్యా పార్టీకి చేస్తున్న సేవల్లో వారి తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉంది. లాల్య మరణం గరిడేపల్లి గ్రామానికి మరియు పార్టీకి తీరని లోటు” అని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంజీ,బోడ రాజేష్, మత్రు, గోపి,చిన్న,లక్ష్మణ్ నాయక్,భట్టు నాను నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


