epaper
Sunday, March 1, 2026
epaper

ఎంపీ రఘునందన్ రావుపై ఆరోపణలు నిరాధారం

ఎంపీ రఘునందన్ రావుపై ఆరోపణలు నిరాధారం
వంటేరు ప్రతాప్ రెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలి
ఆధారాలు లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి
సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు డిమాండ్
కోట మైసమ్మ సాక్షిగా ప్రమాణానికి సవాల్

కాకతీయ, గజ్వేల్ : మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ స్పష్టం చేశారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంపీపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డిని హెచ్చరించారు. ఎంపీ రఘునందన్ రావు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో గెలిచిన ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లను ఒక్కొక్కరిని కోటి రూపాయలకు కొనుగోలు చేశారన్న ఆరోపణలు పూర్తిగా ఆధారరహితమని తెలిపారు. తమ వర్గానికి చెందిన అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ కాలేదనే అక్కసుతో ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి గత రాజకీయ ప్రయాణంపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు డబ్బు సంచుల రాజకీయాలపై ముందుగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్‌రావు డబ్బులు ఇస్తానన్న వ్యాఖ్యలపై కోట మైసమ్మ ఆలయం వద్ద ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఫామ్‌హౌస్‌ల నుంచి డబ్బు సంచులు తెచ్చి అభ్యర్థులకు పంపిణీ చేశారన్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. శిఖండి రాజకీయాలు మానుకొని ప్రజల ముందు నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. లేనిపక్షంలో గజ్వేల్ ప్రజలే తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, టెలికాం బోర్డు సభ్యుడు కమ్మరి శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ ఎల్కంటి సురేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నత్తి శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు చెప్యాల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img