అల్లం నారాయణ సేవలు మరువలేనివి
టీయూడబ్ల్యూజే భద్రాద్రి అధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్
కాకతీయ, కొత్తగూడెం : తెలంగాన జర్నలిస్టు లోకానికి రాష్ట్ర తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్ హెచ్143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ సేవలు మరువలేనివని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ అన్నారు. అల్లం నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శ్రీ జ్యోతి వృద్ధ వికలాంగుల ఆశ్రమంలో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ముందుగా అల్లం నారాయణకు యూనియన్ నాయకులు సభ్యులు జర్నలిస్టులు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లోజీ శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లం నారాయణ ప్రెస్ అకాడమీకి చైర్మన్గా ఉన్న సమయంలో జర్నలిస్టులకు వారి కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కరోనా కాలంలో వ్యాధి భారిన పడ్డ ప్రతి జర్నలిస్టుకు ఆర్థిక సహాయం అందించిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేసినట్లుగా చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కృష్ణ గోవింద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి షఫీ, టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, జిల్లా సహాయ కార్యదర్శి అచ్చి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి చింతల చిరంజీవి, టెంజు ఉపాధ్యక్షులు పిట్టల రమెష్, జిల్లా కమిటీ రామకృష్ణ, నరేష్, దుర్గ, ప్రవీణ్, ఈశ్వర్, శేఖర్, వీరు నాయక్, రాజ్ కుమార్, రాందాస్, నాగరాజు, ఖాజా, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


