కాకతీయ, తెలంగాణ బ్యూరో: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు మనవాళ్లు చదువుకునేందుకు ఉద్యోగాలు చేసేందుకు ఆటంకంగా మారాయన్నారు.
మన దేశానికి సంబంధించి వంద మంది సీఈఓలు ఇతర దేశాల్లో ఉన్నారన్నారు మంత్రి పొన్నం. వారి తెలివి తేటలను మన దేశంలో పెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇక్కడి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాయన్నారు. ఇక విదేశాల్లో ఉన్న తెలంగాణ వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామికంగా సాంకేతికంగా అభివ్రుద్ధి చేయాలని విజ్నప్తి చేస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ అన్నారు.


