కోల్ ఇండియా కబడ్డీ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధం
నేటి నుంచి పోటీల సందడి
ఏర్పాట్ల పనులను పర్యవేక్షించిన అధికారులు
కాకతీయ, కొత్తగూడెం : కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణను కొత్తగూడెం ఏరియాలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కాలనీలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం నందు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు ప్లే గ్రౌండ్ ను క్రీడాకారుల కొరకు ఏర్పాటు చేసిన వసతి గృహాలను గురువారం సంబంధిత అధికారులు ఎజిఎం(సివిల్) డీజీఎం (పర్సనల్)జీవి.మోహన్ రావు, డిజిఎం(ఈ అండ్ ఎం) ఏరియా వర్క్ షాప్ జె.క్రిస్టఫర్, స్పోర్ట్స్ సూపర్వైజర్స్ ఆర్గనైజర్స్ ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం శాలెం రాజు మాట్లాడారు. కార్యక్రమంలో జీఎంతో పాటు ఎస్ఓటు జిఎం జివి.కోటి రెడ్డి, ఎజిఎం(సివిల్)
సిహెచ్.రామకృష్ణ, డిజిఎం(పర్సనల్) జీవి.మోహన్ రావు, డిజిఎం(ఈఅండ్ఎం) ఏరియా వర్క్ షాప్ జె.క్రిస్టఫర్, స్పోర్ట్స్ సూపర్వైజర్స్ ఎంసి.పాస్నెట్, జాన్ వెస్లీ, సిహెచ్.అశోక్, పరసా శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ బి.భీముడు, స్పోర్ట్స్ జనరల్ కెప్టెన్ బి.వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ ఆర్గనైజర్స్ సిహెచ్ సాగర్, కే.శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ ప్రేమ్ కుమార్, జి.రాజశేఖర్, ఎస్.కె గులాం గౌస్, మహేష్ ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


