- ఆదివాసీ ఐక్య కార్యచరణ కమిటీ
కాకతీయ, గుండాల: మండలంలోని యాపలగడ్డ గ్రామం పగిడిద్దరాజు గద్దెల వద్ద ఆదివాసి సంఘాల సమావేశం ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు పూణెం రమణబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు వాగబోయిన చంద్రయ్య దొర పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అయినందున ఏజెన్సీలో ఇతర కులాలకు రిజర్వేషన్ కల్పించడం అనేది ఏజెన్సీని అణిచివేసే ప్రణాళికలు పన్నుతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందన్నారు. ఏజెన్సీలో ఉండాల్సిన రిజర్వేషన్ ఎస్టీ మహిళ, ఎస్టి పురుష, లేదా ఎస్టీ జనరల్, ఉండాలి కానీ ఇతర కులాలకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని అన్నారు.
ఏజెన్సీ చట్టాలైన1/59, 1/70 చట్టాలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయని, ఆదివాసి సంఘాలు దశాబ్దాలుగా పోరాటం చేస్తుంటే పాలకులు పట్టించుకునే పాపాన పోలేదని అన్నారు. అది సరిపోదు అన్నట్లుగా ఇతర కులాలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం ఆదివాసీలకు తీరని అన్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఏజెన్సీ మండలాలలో జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులు ఆదివాసులకే తప్ప ఏ ఇతర కులాలకు కేటాయించిన కాంగ్రెస్ పతనం ఏజెన్సీలో ఖాయమని అన్నారు. గుండాల మండలకేంద్రంలో ఆదివాసి ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో గుండాల మండలం జడ్పిటిసి అభ్యర్థులుగా వాగబోయిన చంద్రయ్య దొర, కొడెం వెంకటేశ్వర్లులను నియమించారు.
కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం శ్రీను, తుడుం దెబ్బ జిల్లా నాయకులు ఊకె రామకృష్ణ, ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షుడు పెండకట్ల మహేందర్, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గోవిందు నరసింహారావు, పెండకట్ల నాగరాజు, సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి కల్తీ లక్ష్మణ్, పూనెం వసంత్, సుదర్శన్, గోగ్గేలా సుధాకర్, తెల్లం కిరణ్, శివాజీ, లిపిన్, పూనెం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


