epaper
Saturday, November 15, 2025
epaper

చాన్నాళ్ల త‌ర్వాత ఢిల్లీలో మెరుగుప‌డిన వాయు నాణ్య‌త

చాన్నాళ్ల త‌ర్వాత ఢిల్లీలో మెరుగుప‌డిన వాయు నాణ్య‌త

కాక‌తీయ‌, న్యూఢిల్లీ(జూలై 26) : వాతావ‌ర‌ణంలో మార్పులు.. ఢిల్లీకి ఊర‌ట‌ను తీసుకొచ్చాయి. చాన్నాళ్ల త‌ర్వాత ఢిల్లీలో వాయు నాణ్య‌త మెరుగుప‌డింది. ఈ ఏడాది జూలైలో దేశ రాజ‌ధానిలో ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది. వాయు నాణ్య‌త సంతృప్తిక‌ర కేట‌గిరీలో న‌మోదు అయ్యింది. ఢిల్లీలో ఈ కేట‌గిరీలో ఎయిర్ క్వాలిటీ చూపించ‌డం చాలా అరుదైన విష‌యం. జూలై 23వ తేదీన సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) కేవ‌లం 67గా న‌మోదు అయ్యింది. కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ బోర్డు ప్ర‌కారం 67 ఏక్యూఐ అనేది సంతృప్తిక‌ర‌మైంది.సాధార‌ణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ‌. ఫ్యాక్ట‌రీలు, వాహ‌నాలు, పంట కాలుష్యంతో ఢిల్లీ ఎప్పుడూ స‌త‌మ‌తం అవుతుంది. ప్ర‌స్తుతం అక్క‌డ అనుకూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల ఏక‌ధాటిగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు గాలి క‌ద‌లిక‌ల్లోనూ మార్పు వ‌చ్చింది. దీని వ‌ల్ల ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో స్వ‌చ్ఛ‌మైన గాలులు వీస్తున్నాయి.అయితే జూలై 25వ తేదీన మ‌ళ్లీ ఎయిర్ క్వాలిటీ మాడ‌రేట్ స్థాయిలో చూపించింది. కానీ రెండుమూడు రోజుల పాటు ఆకాశంలో కాలుష్యం త‌గ్గ‌డం శుభ‌ప‌రిణామంగా భావిస్తున్నారు. క్లీన్ ఎయిర్‌ను పాజిటివ్ సంకేతంగా చూస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణ‌, రెగ్యులేట‌రీ ప‌రిణామాలు.. అర్బ‌న్ ఎయిర్ క్వాలిటీని పెంచిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.సీపీసీబీ డేటా ప్ర‌కారం ఢిల్లీలో జూలై 23వ తేదీన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 67గా ఉంది. జూలైలో ఇదే క్లీనెస్ట్ డేగా రికార్డు అయ్యింది. 51 నుంచి 100 మ‌ధ్య‌లో ఏక్యూఐ లెవ‌ల్స్ ఉంటే దీన్ని సంతృప్తిక‌రంగా పేర్కొంటున్నారు. దీని వ‌ల్ల వాయు సంబంధిత రుగ్మ‌త‌లు ఉండ‌వ‌ని, సాధార‌ణ ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితి బాగుంటుంద‌ని భావిస్తారు.జూలై 22వ తేదీన ఢిల్లీలో వాయు నాణ్య‌త 103గా ఉంది. ఇది మోడ‌రేట్ క్యాట‌గిరీలోకి వ‌స్తుంది. జూలై 24వ తేదీన ఏక్యూఐ .. సంతృప్తిక‌రంగా ఉంది. ఆ రోజు మొత్తం సాటిస్‌ఫాక్ట‌రీ రేంజ్‌లో ఉంది. ఉద‌యం 9 నుంచి రాత్రి ఏడు వ‌ర‌కు … ఏక్యూఐ 76 నుంచి 92 మ‌ధ్య ఉంది. ఇక జూలై 25వ తేదీన ఏక్యూఏ.. 128 నుంచి 136 మ‌ధ్య రికార్డు అయింది. దీన్ని మాడ‌రేట్ కేట‌గిరీగా భావిస్తారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అయోధ్య, కాశీ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ ధరకే IRCTC టూర్ ప్యాకేజీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: పుణ్యక్షేత్రాలను దర్శించాలని కోరుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ...

షెడ్యూల్ ప్రకారం తెలుగు ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి

షెడ్యూల్ ప్రకారం తెలుగు ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్...

క‌నుల విందుగా బ్లాక్ బెర్రీ అందాలు

క‌నుల విందుగా బ్లాక్ బెర్రీ అందాలు ఇసుక దిబ్బ‌ల్లో ఆట‌లు.. పిల్లకాలువలో ఈతలు తాడ్వాయి...

వేడి ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలి

వేడి ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలి సీజనల్ వ్యాధులకు అవకాశం ఇవ్వద్దు...పరిశుభ్రత పిల్లలకు నేర్పాలి జ‌న‌గామ...

ఇంటి ముందు చెప్పులు తిరగబడి ఉంటే.. ఇంట్లో వాళ్లకు ఈ సమస్యలకు తప్పవు 

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల...

ఆధార్‌ కార్డు మోసాలను ఆపాలంటే.. ఇలా కార్డును లాక్‌ చేయండి.!

ఆధార్‌ అన్నింటికి మూలం.. మంచి పనులుక ముంచే పనులకు కూడా ఆధార్‌...

బరువు తగ్గాలని నిమ్మరసం తాగేస్తున్నారా..? ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవు

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఔషధ గుణాలు అనేక వ్యాధుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img