అసమానత్వానికి ఎదురొడ్డి పోరాడిన ఐలమ్మ
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ ఖమ్మం ప్రతినిధి :
వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్థానిక వైరా రోడ్డులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం జిల్లా వెనక బడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆక్యన మాట్లాడుతూ సమాజంలోని అసమానత్వానికి ఎదురొడ్డి నిర్భయంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని, జమీందార్ల పాలనలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అనేక సంఘాలలో ఆమె స్పూర్తి నింపారని అన్నారు. ప్రతి ఒక్కరికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. చాకలి ఐలమ్మకు గుర్తింపుగా కోఠిలోని మహిళ యూనివర్సిటీకి ప్రభుత్వం ఆమె పేరు పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి జి. జ్యోతి, కార్పొరేటర్ 43వ డివిజన్ క్లైమేట్, రజక కులసంఘ నాయకులు, బిసి కుల సంఘ నాయకులు బొడ్డు ఉపేందర్, జక్కుల వెంకటరమణ, కనతాల నరసింహారావు, తుపాకుల ఎర్రగొండ స్వామి, గజ్జల్ల వెంకన్న, పడిగల కృష్ణవేణి, కృష్ణారావు, రేగళ్ల సీతారాములు, సత్తెనపల్లి శ్రీను, అన్నారపు వెంకటేశ్వర్లు, బాసటి హనుమంతరావు, మాచర్ల వేలాద్రి, మేకల సుగుణ రావు, అమర గాని వెంకటేశ్వర్లు, కూరాకుల నాగభూషణం, పేల్లూరి విజయకుమార్, కత్తి నెహ్రూ గౌడ్, దుప్పటి నగేష్, కూరాకుల నాగభూషణం, భూక్య జ్యోతి, మల్లపు సోమరాజు, దుంపటి నగేష్, మాచర్ల వేలాద్రి, బీరెల్లి సీతారాములు, దొనకొండ ముత్తయ్య, వట్టి కోట అప్పారావు, పగిళ్ల బుచ్చిబాబు, ఆరి ప్రసాద్, నెల్లుట్ల వెంకన్న, కాకులారం నరసింహారావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


