epaper
Thursday, January 15, 2026
epaper

భద్రాద్రి పోలీసుల దూకుడు పనితీరు

భద్రాద్రి పోలీసుల దూకుడు పనితీరు
ఏడాదిలో 326 మంది మావోయిస్టుల లొంగుబాటు
రూ.30 కోట్లకు పైగా గంజాయి స్వాధీనం
మహిళలపై నేరాల్లో గణనీయ తగ్గుదల
సైబర్ నేరాలపై విస్తృత అవగాహన
వార్షిక నివేదిక‌ను వెల్ల‌డించిన ఎస్పీ రోహిత్ రాజ్‌

కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ గణనీయ ఫలితాలు సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక నివేదిక–2025 సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది పోలీస్ పనితీరుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఏడాది కాలంలో మొత్తం 326 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. ఇది భద్రాద్రి జిల్లాలో శాంతి స్థాపన దిశగా తీసుకున్న కీలక ముందడుగుగా అభివర్ణించారు. అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రజల సహకారం వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్నారు.

గంజాయి, నేరాలపై ఉక్కుపాదం

ఈ ఏడాదిలో 70 గంజాయి కేసుల్లో 221 మందిని అరెస్టు చేసి, 5,707 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాని విలువ సుమారు రూ.28 కోట్ల 54 లక్షలుగా అంచనా వేశారు. ఇందులో భాగంగా సుమారు రూ.22 కోట్ల విలువైన గంజాయిని తగులబెట్టినట్లు వెల్లడించారు. చోరీ కేసుల్లోనూ కోల్పోయిన ఆస్తిలో గణనీయ మొత్తాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని ఎస్పీ తెలిపారు. గతంలో 420 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 384 కేసులు మాత్రమే నమోదయ్యాయని, తద్వారా 8.57 శాతం తగ్గుదల నమోదైందన్నారు. అయితే పోక్సో, ఎస్సీ–ఎస్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

సైబర్ నేరాలపై అవగాహనకు ప్రాధాన్యం
సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది 196 సైబర్ కేసులు నమోదయ్యాయని, రాబోయే రోజుల్లో సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, అక్రమ గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు, డీసీఆర్బీ, ఎస్బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img