కాకతీయ, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితుడు మంత్రి ఆనందానికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించారని జిల్లా ఏస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
జిల్లా ఏస్పీ తెలిపిన వివరాలు ఇలా.. జూలపెల్లి మండలం తెలీకుంటకు చెందిన మరిపెల్లి రాజయ్య (64) వేములవాడ శివారులో తోటకాపరిగా పనిచేస్తూ, సహచరుడు ఆనందంతో తరచూ గొడవలు పడేవాడు. 2024 ఏప్రిల్ 29న ఆనందం ఇనుపపారాతో దాడి చేసి రాజయ్యను హతమార్చాడు.
మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారని కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో 16 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించగా న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించడం జరిగిందని ఏస్పీ తెలిపారు.


