కాకతీయ, హనుమకొండ/రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో శ్రావణ మాస మూడవ సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసి, హారతుల ధ్వనులు మార్మోగాయి. ఆలయ కమిటీ చైర్మన్ కూరెళ్ళ పెద్ద ఉపేందర్ గుప్తా, రేణుక దంపతులు మాట్లాడుతూ.. మహాదేవుడి ఆశీస్సులు అందరికీ లభించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ వాసులు హరీష్–కవిత దంపతులు, సీనియర్ జర్నలిస్టు చింతకింది కృష్ణమూర్తి–రాజేశ్వరి, లగిశెట్టి లింగయ్య దంపతులు, పోకల పోషనాథం, పోకల హరిప్రసాద్, గందె మంజుల, ఆలయ ప్రధాన అర్చకులు పిండిప్రోలు శ్రీనివాస్ శర్మ, బచ్చు శ్రీనివాస్ గుప్తా, కూరెళ్ళ వేద కుమార్ గుప్తా, వినయ్ కుమార్ గుప్తా, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో వైభవంగా అభిషేకం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


