టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహన దారుడి మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న టూ టౌన్ పోలీసులు
కాకతీయ, కొత్తగూడెం : టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహన దారుడి మృతి చెందిన ఘటన కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ బస్తికి చెందిన వేణుగోపాల్ టిఎస్28 బి 0453 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై రుద్రంపూర్ నుండి కొత్తగూడెం వస్తున్న క్రమంలో కొత్తగూడెం నుండి (టీజీ 28 టీ 4125) నెంబర్ గల బొగ్గు టిప్పర్ టూ వీలర్ ని డీ కొట్టడంతో తీవ్రంగా గాయలతో రక్తపు మాడుగుల్లో పడి ప్రణాపాయ స్థితిలో ఉన్న సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయం తో ప్రమాదానికి గురైన వేణుగోపాల్ ని 108వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు వేణుగోపాల్ మృతి చెందాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


