- బీజేపీ పాలేరు నియోజకవర్గ కాంటెస్ట్ అభ్యర్థి నున్నా రవికుమార్
కాకతీయ, ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గొల్లగూడెం వాసి కెప్టెన్ మడికంటి కిషోర్ రెడ్డిని బుధవారం బీజేపీ నేత, పాలేరు నియోజకవర్గ కంటెస్ట్ అభ్యర్థి నున్న రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో కీలక భూమిక పోషించిన వాయుసేన కెప్టెన్ మడికంటి కిషోర్ రెడ్డి ఖమ్మం జిల్లా వాసి కావడం మనకు గర్వకారణమన్నారు. విశిష్ట సేవా పురస్కారానికి నామినేట్ అయి, 2007 నుండి వాయుసేనలో కొనసాగుతూ ఉత్తమ సుప్రీం కమాండర్ గా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారన్నారు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డిని బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కో ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోటమర్తి సుదర్శన్, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్లమాస శ్రీనివాస్, మండల నాయకులు సత్తి నాగరాజు, ఉపేందర్ రెడ్డి, వేగినాటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


