మున్సిపల్ వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అభినందనలు
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన మేడిశెట్టి ఉమా–శ్రీధర్‌ను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు నాయకం మల్లయ్య, మాజీ కోశాధికారి సుక్క చంద్రయ్య, సిద్ధిపేట పట్టణ మాజీ కార్యదర్శి ఆకుల బాలయ్య, ఉపాధ్యక్షుడు గాజుల రాజయ్యలు పూలమాలలు, శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకం మల్లయ్య మాట్లాడుతూ చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం పట్ల జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని మేడిశెట్టి ఉమా–శ్రీధర్‌కు సూచించారు. అలాగే బీసీల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు జనాభాకు అనుగుణంగా స్థానాలు కేటాయించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మాంగోల్ చంటి, పాకనాటి భాస్కర్, ఆవుశేర్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


