నిరుద్యోగులకు వరం.. మెగా జాబ్ మేళా
సద్వినియోగం చేసుకోండి
ఉపాధితో కుటుంబాలకు భరోసాగా ఉండాలి
ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం క్లబ్బులో ఈనెల 16వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాను జయప్రదం చేయాలని ఈ జాబ్ మేళా నిరుద్యోగులకు వరమని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు. శనివారం చుంచుపల్లి మండలంలోని సారయ్య కాలనీలో గల సంఘ కార్యాలయంలో ఈ మెగా జాబ్ మేళా పోస్టర్లను ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన సంఘ సభ్యులతో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు డిగ్రీ నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు
బీటెక్ ఎంటెక్ ఎంబీఏ కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులకు అంతేకాకుండా ఐటిఐలో వివిధ ట్రేడ్ లను చేసిన అభ్యర్థులకు వారి ప్రతిభను బట్టి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా చెవిటి మూగ దివ్యాంగులకు ట్రాన్స్ జెండర్ ల కూడా ఈ యొక్క జాబ్ మేళాలో అవకాశం కల్పించబడుతుందని చెప్పారు. ఇంతటి గొప్ప మెగా జాబ్ మేళా కొత్తగూడెంలో ఇప్పటివరకు జరగలేదని తెలిపారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అవిరల కృషితో చొరవతో ఉపముఖ్యమంత్రి అభివృద్ధికి మార్గదర్శకులు మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి జిల్లాల పార్లమెంటరీ సభ్యులు రామ సహాయం రఘురామారెడ్డి ఆశీస్సులతో జాబ్ మేళా నిర్వహించబడుతుందన్నారు.
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అభ్యుదయవాది అభివృద్ధి సాధకుడు బలరాం నాయక్ సౌజన్యంతో ఉచిత మంచినీరు టిఫిను మధ్యాహ్నం భోజనం వసతి మొదలైన సౌకర్యాలన్నిటినీ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయా రంగాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులందరూ ఈ సువర్ణ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని విజ్ఞప్తి చేశారు.
ఈ మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తో పాటు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పీక కృష్ణ, గాంధీ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు చింతలచెరువు గిరీశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు అపరబాలు అల్లి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూర రవీందర్, రాష్ట్ర మహిళా నాయకురాళ్లు బడికల పుష్పలత రత్నకుమారి, లావణ్య, జిల్లా నాయకులు వరప్రసాద్, గిట్ల పురుషోత్తం, ఉండేటి సుధీర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.


