- విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు అందజేత
- చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఇటీవల అకాల వర్షాలతో జలగం నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ముంపునకు గురై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవనం నీటిలో మునిగిపోవడంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి స్కూల్‌ను సురక్షిత ప్రాంతానికి మార్చమని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పాఠశాలను అరెంపులలోని మహమ్మదీయ కాలేజీ వద్దకు తరలించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలను గుర్తించిన తుమ్మల యువసేన ఆధ్వర్యంలో నోట్ బుక్స్ అందజేశారు. శుక్రవారం ఆయన పాఠశాలకు వెళ్లి విద్యార్థులను స్వయంగా పలకరించారు. తుమ్మల యువసేన తరఫున 250 స్కూల్ బ్యాగ్స్‌ను అందజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యా ప్రమాణాల పెంపునకు సూచనలు చేశారు. విద్యార్థులతో కలిసి యుగంధర్ సహపంక్తి భోజనం చేశారు.


