పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “వందే మాతరం”
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
“వందే మాతరం” జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.



