- వర్ధన్నపేట ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి
కాకతీయ, రాయపర్తి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుకు సరైన మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని వర్ధన్నపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి కోరారు. జగన్నాథ పల్లి, బాలు నాయక్ తండా, సన్నూరు, వెంకటేశ్వర పల్లి, కాట్రపల్లి, కృష్ణాపురం, పోతిరెడ్డిపల్లి, బురాన్ పల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల క్షేమం కోరుతూ సకాలంలో ధాన్యం విక్రయించుకునేందుకు గత ఏడాది రాయపర్తి మండలంలో 26 కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈ సారి 47 కు పెంచిందన్నారు.
ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. సన్నారకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దళారుల చేతుల మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అన్నారు. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తప్పనిసరిగా నష్టపరిహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్, పాల్వంచ కోటేశ్వర్, వనజారాణి, చెవ్వు కాశీనాదం, నంగునూరి అశోక్, మచ్చ రమేష్, పీరని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


