మేము యూస్ లెస్ ఫెలోలమా
ఏం మాట్లాడుతున్నారు మేడం
అమ్మ ఇంకేమీ అనను రండి డ్యూటీ చేసుకోండి
మీ ప్రవర్తన బాగాలేదు మేడం మేము రాము
ఎక్సైజ్ శాఖలో సీఐ బతిమిలాడుపర్వం
ఎక్సైజ్ శాఖను ఎవరు పట్టించుకుంటారో…?
కాకతీయ, కొత్తగూడెం : రూరల్ఏంటి మేడం మీ దగ్గర మేము పని చేస్తుంటే యూస్ లెస్ ఫెలోలమా మీరు సీఐ హోదాలో ఉంటూ ఇలాంటి మాటలు అనొచ్చా .. మేము కష్టపడి చదువుకున్నాం మేడం మీ ప్రవర్తన తీరులో విసుగు పోయాం మేము డ్యూటీలు చేయలేమంటూ ఎక్సైజ్ శాఖ సిబ్బంది భీష్మించి కూర్చున్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎక్సైజ్ వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన విధితమే. దీంతో ఆ కానిస్టేబుల్ బంధువులు ఎక్సైజ్ శాఖకు వచ్చి ఆందోళనలకు దిగారు . ఎక్సెస్ సీఐ ప్రవర్తన తీరుపై నిలదీశారు. ఆత్మహత్య రత్నానికి పాల్పడ్డ మహిళా కానిస్టేబుల్ మేనమామ ఎక్సైజ్ శాఖకు వచ్చి అధికారులను నిలదీశారు .
మేము దళితులమని చిన్నచూపు చూడటం ఏంటి మేడం మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి క్రింది స్థాయి సిబ్బందిని అనేక ఇబ్బందులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అదృష్టం బాగుండి తన మేనకోడలు ప్రాణప్రియ స్థితిలో నుంచి బయటపడింది గాని చచ్చిపోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటారు అంతే కదా మేడం. అంటూ సిఐని నిలదీశారు. దీంతో సిఐ మాట్లాడుతూ అమ్మ నేను ఇంకా ఏమీ అనను రండి వచ్చి మీ డ్యూటీలు మీరు చేసుకోండి నా మాట వినండి అంటూ సంబంధిత సిబ్బందిని బ్రతిమిలాడారు . మేడం మీ ప్రవర్తనను బట్టి మేము అంత విసుగిపోయాం మేము డ్యూటీలు చేయలేం మేము రాము అంటూ కార్యాలయం ఎదుట భీష్మించి కూర్చున్నారు. సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ.దళితుల కుటుంబాల్లో మేము పుట్టడమే నేరమా.. సమాజంలో మేము ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు లేదా మేము ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు చేస్తా ఉంటే మా పై ఉన్న అధికారులు మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.



