కాకతీయ, నర్సింహులపేట : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీలను మంగళవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం వద్ద ఐదు హుండీలను పరిశీలకుడు అనిల్ ఆధ్వర్యంలో లెక్కించగా 2,16840 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వెంకట్రావ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వేముల విజయపాల్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మార్కశేఖర్, అర్చకులు నందనాచార్యులు, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.


