కాకతీయ, జూలూరుపాడు: మండల కేంద్రంలో జూలూరుపాడు, చండ్రుగొండ ఆటో అడ్డా యూనియన్ ప్రెసిడెంట్ గా మలకం వీరభద్రం, వైస్ ప్రెసిడెంట్ గా కొమ్మిగిరి కామేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డాకు చెందిన డ్రైవర్లకు తమ వంతుగా సహాయ సహకారాలు అందచేస్తామని తెలిపారు. ఈ ఆటో యూనియన్ ఎన్నికల్లో సెక్రటరీగా పత్తిపాటి మోహన్, కోశాధికారిగా నేలాల అశోక్, సలహాదారులుగా తాటి అరుణ్, కుమార్ కాకటి, నరసింహారావు, పూర్ణచంద్రరావు, సామేలు, జమలయ్య ఎన్నికయ్యారు.


