- చుంచుపల్లి మండల బీఆర్ ఎస్ నాయకులు
- ఘనంగా మాజీమంత్రి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు
కొత్తగూడెం కాకతీయ, రూరల్ : వనమా వెంకటేశ్వరరావుతోనే కొత్తగూడెం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చుంచుపల్లి నియోజకవర్గ బీఆర్ ఎస్ నాయకులు అన్నారు. మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, బీఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు శనివారం మండలకేంద్రంలో కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓ సారి మంత్రిగా పనిచేసిన వనమా సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకోవాలని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మిడి రమాకాంత్, కొప్పరి నవతన్ పెయింటర్ రాజేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్, మాజీ ఉప సర్పంచులు దుర్గేష్, శ్రీహరి, నాయకులు రాజా, పోకల నగేష్, గోవిందు, శివ, కనుకుంట్ల రవి, బబ్లు, గడ్డం వెంకటేశ్వర్లు, పులి, మల్లయ్య, శంకర్, గోపి, జంపన్న, తదితరులు పాల్గొన్నారు.


