- పోలీస్ కమిషనర్ సునీల్ దత్
- మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం రూరల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నేలకొండపల్లి మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది. ఈ శిబిరంలో 1,500 మందిపైగా దాతల నుంచి రక్తం సేకరించారు.. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారని, ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, సీఐలు మురళి, రాజు, సంజీవ్, సాగర్, ఎస్ఐ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.


