- వల్లభాయ్ పటేల్ చూపిన దారిలో వికసిత భారత్
- ఉక్కు మనిషి పేరు మరిచిన కాంగ్రెస్
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు
- ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు
కాకతీయ, ఖమ్మం టౌన్: దేశాన్ని ఏకం చేసిన పటేల్‌ను కాంగ్రెస్ చరిత్రలో అణగదొక్కిందని, ఆయనకు తగిన గౌరవం ఇవ్వకుండా, కుటుంబపరమైన రాజకీయాల పట్లే కాంగ్రెస్ దృష్టి పెట్టిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియం నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు ఐక్యతా ర్యాలీని నిర్వహించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్ భారత్‌లో విలీనం కాకపోయేదన్నారు. పటేల్ చరిత్రను తిరిగి వెలుగులోకి తెచ్చిన బీజేపీ, ఆయన విలువలను కాపాడడమే తమ కర్తవ్యం అని ఆయన అన్నారు.
దేశాన్ని ఏకం చేసిన పటేల్‌ను చరిత్ర పుస్తకాల చివరి పేజీల్లోకి కాంగ్రెస్ నెట్టేసిందని విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత ఆయనకు తగిన గౌరవం ఇవ్వకుండా, ఒక కుటుంబానికి మాత్రమే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. పటేల్ ఐక్యత మార్గమే నేటి వికసిత భారత్‌కు మార్గదర్శనం చేస్తోందని కోటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, వీరవెల్లి రాజేష్, రవి రాథోడ్, నకరికంటి వీరభద్రం, గంటేల విద్యాసాగర్, మందడపు సుబ్బారావు, దొడ్డా అరుణ, దుద్దుకూరు వెంకటేశ్వరరావు, మందార ప్రభాకర్ రెడ్డి, జ్వాలా నరసింహారావు గౌడ్, ఆర్విఎస్ యాదవ్, రజినీ రెడ్డి, నెల్లూరు బెనర్జీ, మంద సరస్వతి, బోయినపల్లి చంద్రశేఖర్, సురేందర్ రెడ్డి, రామ్ శెట్టి నాగేశ్వరావు, కొంచెం కృష్ణారావు, రవి గౌడ్, సైదేశ్వర రావు, బోయినపల్లి సురేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


