ఉత్కంఠ పోరు.. భారత్ విజయం
కాకతీయ, స్పోర్ట్స్ బ్యూరో : ఇంగ్లండ్తో ఉత్కంఠగా సాగిన ఐదో టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి రోజు విజయానికి 4 వికెట్లు తీయాల్సి ఉండగా భారత బౌలర్లు చెలరేగారు. సిరాజ్, ప్రసిద్ధ ఒత్తిడిని జయించి టీమ్ ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-2తో(ఒక మ్యాచ్ డ్రా) సమం చేసింది.


