- తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
కాకతీయ, కరీంనగర్ : నగరంలోని ప్రధాన వ్యాపార ప్రాంతమైన టవర్ సర్కిల్‌లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టవర్ సర్కిల్ రోడ్డుపై ఉన్న ఓ దుస్తుల షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే మంటలు పక్కనే ఉన్న ఫోటో స్టూడియో, వెడ్డింగ్ డెకరేషన్ సామగ్రి షాపులకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగ కారణంగా పరిసర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో లక్షల రూపాయల విలువైన వస్త్రాలు, ఫొటో సామగ్రి, వెడ్డింగ్ డెకర్ మెటీరియల్ దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రాణనష్టం జరగలేదని స్థానికులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


