తెలంగాణ ముదిరాజ్ మహాసభ కమిటీ సభ్యులతో ఈటెల భేటీ.
ముదిరాజుల రాజకీయ చైతన్యం కోసం పని చెయండి ఈటెల.
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు బుధవారం ఎంపీ ఈటెల రాజేందర్‌ను కలిశారు.ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.ముదిరాజ్ సమాజం తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర సామాజికాభివృద్ధిలోనూ విశేష పాత్ర పోషించిందని ఆయన అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ నాయకులు చురుకుగా ముందుకు వచ్చి సమాజానికి ప్రాతినిధ్యం వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా మహాసభ అధ్యక్షుడు గీకురు రవీందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పండుగ నాగరాజు ముదిరాజ్, గౌరవాధ్యక్షుడు కోలకాని నరసయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులు బండారి నరేందర్ ముదిరాజ్, జెట్టి బాలయ్య ముదిరాజ్, అధ్యయన వేదిక కమిటీ అధ్యక్షుడు బండారి భూమేష్ ముదిరాజ్, యువత అధ్యక్షుడు రెడ్డి సురేష్ ముదిరాజ్, కోశాధికారి గుంటుక శంకర్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి కుంభ మల్లయ్య ముదిరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈటెల రాజేందర్‌ను నాయకులు ఆత్మీయంగా కలసి ఆశీర్వాదాలు పొందారు. త్వరలో పూర్తిస్థాయి జిల్లా కమిటీని ప్రకటిస్తామని అధ్యక్షుడు గీకురు రవీందర్ ముదిరాజ్ తెలిపారు.


