కాకతీయ, తుంగతుర్తి: ఆయిల్ పామ్ తోటల సాగులో మెళకువలు తెలుసుకొనేందుకు తుంగతుర్తి, సూర్యాపేట డివిజన్ పరిధిలోని మండలాలకు చెందిన పలువురు రైతులు మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి, దమ్ముపేట మండలాలకు క్షేత్ర సందర్శనకు వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట డివిజన్ ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి కే స్వాతి జెండా ఊపి ప్రారంభించారు. ఆయిల్ పామ్ తోటలో అంతర పంటలుగా సాగు చేస్తున్న వక్క, తమలపాకు, జాజికాయ, జాపత్రి వంటి విభిన్న పంటలను రైతులు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన అధికారిని స్వాతి, పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ జిల్లా మేనేజర్ వి. శశి కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, విస్తరణ అధికారులు ముత్యం రాజు, కే రాము, వీ అనిల్, క్షేత్ర సహాయకులు భద్రాచలం, నాగరాజు, రమేష్, కరుణాకర్, సందీప్, లింగయ్య, అశోక్, రైతులు పులుసు వెంకటయ్య, జనార్దన్ రావు, కొండల్ రెడ్డి, ఉదయ్ రావు తదితరులు పాల్గొన్నారు.


