కాకతీయ ప్రతినిధి, కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. తాజాగా చెక్పోస్టులపై ఏక కాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ నేడు ములకలపల్లి గ్రామ పరిపాలనాధికారినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ములకలపల్లి లో గ్రామ పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి 60 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మొదట 40, 000 తీసుకొని ఒప్పందం ప్రకారం మిగిలిన 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ములకలపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.


