- మండల వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్
కాకతీయ కొత్తగూడ : వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా మండలంలోని రైతులు వ్యవసాయ పరికరాల కోసం క్లస్టర్ రైతు వేదికలో దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాటరీ, పవర్ స్ప్రేయర్, ట్రాక్టర్ పరికరాలు, స్ట్రా బేలర్ కావలిసిన రైతులు తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, జనరల్, మహిళా రైతులకు 50% సబ్సిడీ, ఇతరులకు 40% సబ్సిడీ ఉంటుందనీ తెలిపారు. 31లోపు దరఖాస్తు చేసుకోవాలని, అప్లికేషన్ ఫారంతో పాటు రైతు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ ఇతర అవసరమైన పత్రాలు తీసుకురావాలని అన్నారు. పూర్తి వివరాలకు ఏఈవోలను సంప్రదించాలని సూచించారు.


