కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నల్లబండ బోడు ఆదివాసి గ్రామానికి చెందిన విద్యార్థిని ముక్తి మశ్రేఖ మహబూబ్ నగర్ జిల్లా గండుగలపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. రాష్ట్రస్థాయిలో బాలికల విభాగంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో తను జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిపింది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముక్తి మశ్రేఖ కు జాతీయస్థాయిలో జరిగే వాలీబాల్ పోటీలకు ఎంపిక చేశారు. వాలీబాల్ లో ప్రతిభ కనబరుస్తున్న మశ్రేఖను, నల్ల బండ బోడు గ్రామస్తులు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు నల్లబండబోడు విద్యార్థి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


