ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన
కాకతీయ, పినపాక: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై ఈ నెల 6న సుప్రీంకోర్టులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ నాయకులు వల్లేపోగు వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పినపాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ గోపాల కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతి, వల్లేపోగు రాము, తదితరులు పాల్గొన్నారు.


