బీసీ బంద్ కు అందరూ సహకరించాలి
కాకతీయ, గుండాల: బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో బీసీ సంఘాలు 18న ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలిపిందని పార్టీ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్ అన్నారు. బంద్ కు మండల వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. గుండాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోఅత్యధిక జనాభా కలిగిన బీసీలు రిజర్వేషన్ లేక పోవటంతో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. రిజర్వేషన్ అమలు జరిగితే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు 62 శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు ముందు సాగాలని కోరారు. సమావేశంలో సిపిఐ మండల నాయకులు గడ్డం శ్రీనివాస్, బచ్చల రామయ్య, ఎస్కే సాహెబ్ కుమార్, కల్తీ కన్నయ్య, ఎస్కే సమీర్, ఎస్కే షాహిద్ తదితరులు పాల్గొన్నారు.


