కాకతీయ, బయ్యారం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి ఆటల పోటీలలో విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపికైనట్లు ఫిజకల్ డైరెక్టర్ వాలు తెలిపారు. ఈనెల 14, 15ల్లో బయ్యారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గేమ్స్ ఎంపికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇరుస్లాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. అండర్ 17 వాలీబాల్ లో మొదటి బహుమతి, అండర్ 14 వాలీబాల్ పోటీలలో మొదటి బహుమతి, అండర్ 14 కబడ్డీ పోటీలలో ద్వితీయ స్థానాన్ని వారు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అండర్ 14 ఖోఖో పోటీలలో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. జోనల్ స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు శోభన్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.


