- జిల్లా వ్యాప్తంగా నెల పాటు “చైతన్యం” పేరుతో పలు కార్యక్రమాలు
- భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జిల్లాలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. చైతన్యం పేరుతో బుధవారం నుండి నవంబర్ 15వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మాలన కోసం వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత్తుకు బానిసలుగా మారిన యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వారిలో చైతన్యం నింపేందుకే ప్రత్యేకంగా ఈ కార్యమానికి శ్రీకారం చేపడుతున్నారన్నారు. ఎవరైనా మత్తు పదార్దాలను సేవిస్తూ పట్టుబడితే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం వాహన తనిఖీలు వంటి కార్యక్రమాలను ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేస్తారని తెలిపారు. గంజాయి రవాణా, విక్రయం, సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. చైతన్యం పోస్టర్ల ఆవిష్కరణలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, మణుగూరు డీఎసీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.


