కాకతీయ, గుండాల: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హయాంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే గుండాల మండల అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన గుండాల మండలానికి అభివృద్ధిలో ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసినదని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరచకుండా సాధ్యం కాదని తెలిసినాన జీవో నెంబర్ 9ని తీసుకువచ్చి బీసీలను మోసం చేసిందని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు తిరుకొల్లూరి రాము, గడ్డం వీరన్న, నిట్ట రాములు, సయ్యద్ అజ్జు, తాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


