epaper
Sunday, March 1, 2026
epaper

రైతుకు కనీస మద్దతు ధర అందించాలి

  • ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు లక్ష్యం
  • పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు

కాకతీయ, విజయవాడ: భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు రాష్ట్రం లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో భారత ప్రభుత్వం ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. నగరంలోని పటమట యనమలకుదురు రోడ్డులోని భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రికేయులతో మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతుకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత ఏడాది ఖరీఫ్ లో 15.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేసామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఎఫ్ సీఐ నుంచి పంజాబ్ రాష్ట్రం తర్వాత 14 లక్షల టన్నుల బియ్యాన్ని 10 % బ్రోకెన్ తో సేకరించడానికి అనుమతి ఉన్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.

గత అనుభవాల ధృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలు పెంచాలని కోరటం జరిగిందని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని పెంచిందన్నారు. గత రబీ సీజ్ లో 9.93 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది రబీలో కొనుగోలు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో సోలార్ విద్యుత్ కు 45 మెగా వాట్స్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్లానెల్స్ పెట్టుకోగల అవకాశం కలిగి ఉందని వివరించారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ: భారత ఆహార సంస్థ ద్వారా ప్రతి నెలా 1.54 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ అవుతుందన్నారు.

ఫోర్టిఫైడ్ రైస్ ను రాష్ట్రంలో 24.47 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం క్రింద, మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 55,746 అంగన్వాడీ కేంద్రాలకు ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర (MSP) ప్రయోజనం కల్పించేలా, ప్రజలకు ప్రజా పంపిణీ వ్వవస్థ ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగాను సమీక్షించారు. కమిటీ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, భారత ఆహార సంస్థ ఏపీ రీజనల్ జనరల్ మేనేజర్ విజయ కుమార్ యాదవ్, సివిల్ సప్లైస్ అధికారులు, భారత ఆహార సంస్థ అధికారులు, భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సభ్యులు, తదితరలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం 23 మంది...

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు!

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో...

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలుగు...

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం నిజాలు దాచితేనే మహాపాపం ప్రజల దృష్టికి తీసుకెళ్లడం...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...

టీటీడీలో మరో కుంభకోణమా?

టీటీడీలో మరో కుంభకోణమా? గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు విమాన గోపురం బంగారు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img