epaper
Monday, March 2, 2026
epaper

అధికారి గుప్పిట అట‌వీశాఖ‌

అధికారి గుప్పిట అట‌వీశాఖ‌
భ‌ద్రాద్రి స‌ర్కిల్‌లో సొంత రాజ్యం
అవినీతి, అక్ర‌మార్కుల‌కు ఉన్న‌తాధికారి అభ‌య‌హ‌స్తం
కీల‌క స్థానంలో నాలుగేళ్లుగా తిష్ట‌.. నెల‌వారీగా భారీగా వ‌సూళ్ల ప‌ర్వం
ఏప‌నైనా.. ల‌క్ష‌లే ల‌క్ష్యం.. క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉండాల‌న్న ఇవ్వాల్సిదేనంట‌
ఖ‌మ్మం ఎఫ్ ఆర్వో స‌స్పెన్ష‌న్‌ను అడ్డుకునేందుకు ఉన్న‌తాధికారి విఫ‌ల‌య‌త్నం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భ‌ద్రాద్రి స‌ర్కిల్ అట‌వీ శాఖ‌లో ఓ ఉన్న‌తాధికారి పనితీరు..వ‌సూళ్ల వ్య‌వ‌హారంపై ఇప్పుడు జోరుగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అక్ర‌మాలకు పాల్ప‌డే ఉద్యోగులు, అధికారుల‌ను కాపాడ‌ట‌మేకాకుండా.. అక్ర‌మాల్లోనూ గ‌ట్టిగానే అమ్యామ్యాల‌కు అలావాటు ప‌డిన‌ట్లుగా డిపార్ట్‌మెంట్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. స‌ద‌రు అధికారి నాలుగేళ్లుగా స‌ర్కిల్‌లో తిష్ఠ‌వేసి.. అక్ర‌మార్కుల‌ను పెంచి పోషిస్తూ.. నెల‌వారీగా మాముళ్లను ల‌క్ష‌ల్లో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. నెల‌వారీ మాముళ్లే కాదు.. స్పెష‌ల్ టాస్కులు.. స్పెష‌ల్ రాబ‌డీల్లోనూ త‌న వాటాను గ‌ట్టిగానే పుచ్చుకుంటూ అవినీతి అధికారుల‌కు వెన్ను ద‌న్నుగా నిలుస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఇటీవ‌ల ఖ‌మ్మం ఎఫ్ ఆర్వో నాగేశ్వ‌ర్‌రావుపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఉన్న‌తాధికారుల‌కు రిఫరెన్స్‌చేసే స్థాయికి అధికారి దిగ‌జారిన‌ట్లు స‌మాచారం. నాగేశ్వ‌ర్‌రావుకు అనుకూలంగా రిపోర్టు ఉండాల‌ని, ఆయ‌న‌కు నెగ‌టివ్‌గా రిపోర్ట్ రాకుండా చూడాల‌ని జిల్లా స్థాయిఅధికారుల‌ను గ‌ట్టిగానే త‌న ప‌ద్ధ‌తిలో కోరిన‌ట్లుగా తెలుస్తోంది.

నాలుగేళ్లుగా సొంత రాజ్యం..!

అట‌వీశాఖ భ‌ద్రాద్రి స‌ర్కిల్ ప‌రిధిలోని వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌,మ‌హ‌బూబాబాద్‌, ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ చేసే బాధ్య‌త‌ల్లో ఉన్న స‌ద‌రు అధికారి.. ఏ విష‌యాన్ని అంత మాములుగా వ‌దిలేయ‌డ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సార్‌కు ముట్టాల్సినవి ముట్టాల్సిందే.. గిట్టాల్సింది గిట్ట‌నిదే నిద్ర‌పోనివ్వ‌డ‌న్న చ‌ర్చ డిపార్ట్‌మెంట్ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. సర్కిల్‌లో కీల‌క స్థానంలో ప‌నిచేస్తున్న స‌ద‌రు అధికారి నాలుగేళ్ల‌కు పైబ‌డి కూర్చుని వ‌ద‌ల‌కుండా పాతుకుపోయిన ఆ అధికారి మొత్తం శాఖ‌నే భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. అక్ర‌మాల‌కు వెన్నుద‌న్నుగా నిల‌వ‌డ‌మే కాదు.. అక్ర‌మాల్లోనూ వాటాలు పుచ్చుకుంటున్న‌ట్లు స‌మాచారం. అక్ర‌మార్కుల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తే..డిపార్ట్‌మెంట్ చ‌ర్య‌లకు దిగితే.. ముందు సారే అడ్డుప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఇలా వేటు ప‌డినా అధికారుల నుంచి పోస్టింగ్‌ల కోస‌మంటూ ల‌క్ష‌ల్లో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ ధ‌నార్జ‌నే ధ్యేయంగా విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.

అక్ర‌మార్కుల‌కు సార్ అభ‌య హ‌స్తం

ఖమ్మం ఫారెస్ట్ రేంజ‌ర్‌గా పనిచేస్తున్న నాగేశ్వర్‌రావు అధికారి తప్పుడు బిల్లుల పేరుతో మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంత జరిగిన ఆ అధికారిని స‌ర్కిల్‌లో కీల‌క స్థానంలోని ఉన్న‌తాధికారి కాపాడేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి ఇప్పటికే ఐదు నుంచి ఆరుసార్లు ఖమ్మం రేంజర్ ను కాపాడినట్లుగా బలమైన ఆరోపణలున్నాయి. ఈ ఉన్నతాధికారి చేతిలో ఐదు జిల్లాలు ఉండడమే గాక ఈ జిల్లాల్లో పనిచేసే సిబ్బంది నీ సైతం పర్యవేక్షిస్తూ వారి స్థానాల్లో పోస్టింగ్‌లు పొందాల‌న్నా, ఉద్యోగోన్న‌తులు స‌క్ర‌మంగా రావాల‌న్నా, క్రమశిక్షణ చర్య‌లు జ‌ర‌గ‌కుండా ఉండాలన్నా.. సార్‌కు లక్ష‌ల్లో స‌మ‌ర్పించుకోవాల్సిదేనంట‌. ఖ‌మ్మం ఘ‌ట‌న‌లో అధికారిని కాపాడేందుకు స‌ద‌రు అధికారే స్వ‌యంగా జిల్లా స్థాయి అధికారుల‌కు రిపోర్టులు తాను చెప్పిన‌ట్లుగా రావాల‌ని ఆదేశించిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే విజిలెన్స్ అధికారులు సీరియ‌స్‌గా ఉన్న‌ట్లుగా గ్ర‌హించిన జిల్లా అధికారులు ఏం జ‌రిగిందో అదే పంపడంతో సార్ ఆట‌లు సాగ‌లేద‌ని తెలుస్తోంది. అయితే ఇంత‌జ‌రిగినా..స‌స్పెన్ష‌న్ వేటు ప‌డిన అధికారికి ఏం ఫ‌ర్వాలేదు నేనున్నా..త్వ‌ర‌లోనే మ‌రోచోట పోస్టింగ్ వ‌స్తుంది కంగారుప‌డ‌కు..ఆందోళ‌న చెంద‌కంటూ భ‌రోసా ఇచ్చిన‌ట్లుగా డిపార్ట్‌మెంట్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ప‌థ‌కాల నిధుల్లోనూ మేత‌..

అటవీ శాఖ పరిపాలనలో పలు పథకాలను అమలు చేస్తుంటారు. ప్రత్యేకించి తెలంగాణ‌ కాంపన్సేటరీ ఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (సీఏఎంపీఏ) పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తారు. అటవీ భూమి, పర్యావరణ వ్యవస్థ సేవలు నష్టపోయినట్లయితే పరిహారం ద్వారా అటవీకరణను పెంచడం, సహజ పునరుత్పత్తి సహాయంతో అడవుల నాణ్యతను మెరుగుపర్చడం, జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడం, వన్యప్రాణుల అవాసాలను మెరుగుపర్చడం, అటవీ అగ్ని నియంత్రణ, అటవీ రక్షణ, నేల, నీటి సంరక్షణ కోసం ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను మంజూరు చేస్తారు. కమిటీలను ఏర్పాటు చేసి వీటి ద్వారానే అడవుల్లో చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులు, నీటికుంటలు, పూడిక తీత పనులు, మొక్కలు నాటడం, అడవుల్లో విత్తనాలు చల్లించడం తదితర పనులను చేపడతారు. అయితే ఈ పథకాలకు సంబంధించి కేటాయించిన నిధుల వినియోగంలో కూడా స‌ద‌రు ఉన్న‌తాధికారి ఎఫ్ ఆర్వోల‌తో క‌లిసి నిధుల గోల్‌మాల్ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా ఒకే సర్కిల్లో పని చేసుకుంటూ అందిన కాడికి దండుకుంటూ తనకు నచ్చిన సిబ్బందిని అక్కున చేర్చుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. స‌ద‌రు అధికారి ఏ ప్రభుత్వం ఏర్పడిన సంబంధిత శాఖ మంత్రులను, రాష్ట్ర ,కేంద్రస్థాయి ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ శాఖకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అక్ర‌మ ప‌ర్మిట్ట విష‌యంలో ఉన్న‌తాధికారి పాత్ర‌పై నా కూడా ఎంక్వ‌యిరీ జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తుండ‌గా, ప్ర‌భుత్వం నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రిపి స‌ద‌రు అధికారి చెర నుంచి స‌ర్కిల్‌ను త‌ప్పించాల‌ని డిపార్ట్‌మెంట్‌లోని నిజాయితీ అధికారులు కోరుతుండ‌టం గ‌మనార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img