epaper
Sunday, March 1, 2026
epaper

విశాఖకు సిఫీ

  • తరలివచ్చిన మరో ప్రతిష్టాత్మక సంస్థ
  • సిఫీ, ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ సీఎల్ ఎస్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

కాక‌తీయ‌, విశాఖపట్నం : విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్(Sify Infinit Spaces Limited) ఏర్పాటుచేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మధురవాడలోని ఐటీ పార్క్ కు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు మంగళవాయిద్యాల మధ్య సంస్థ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు, రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. నాస్ డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్.. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది.

ఈ కార్యక్రమంలో సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, సిఫీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెన్నకేశవ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, గంటా రవితేజ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఐటీసీ అండ్ ఈ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, విశాఖ కలెక్టర్ హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం 23 మంది...

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు!

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో...

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలుగు...

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం నిజాలు దాచితేనే మహాపాపం ప్రజల దృష్టికి తీసుకెళ్లడం...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...

టీటీడీలో మరో కుంభకోణమా?

టీటీడీలో మరో కుంభకోణమా? గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు విమాన గోపురం బంగారు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img