కాకతీయ, కొత్తగూడెం రూరల్: నిస్వార్థ సేవే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ, సమాజ హిత కార్యాచరణతో పని చేస్తున్న ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ఐ ఎస్ జి ఎఫ్) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి చిల్డ్రన్స్ పార్కులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కార్యాలయంలో ఐ ఎస్ జి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమ్మేళనం జరిగింది. సింగరేణి జీఎం వెల్ఫేర్ జీవి కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేవే లక్ష్యంగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఐ ఎస్ జి ఎఫ్ జాతీయ అధ్యక్షుడు (ఎగ్జిక్యూటివ్)మ్యాక్ మిక్కి ప్రధాన పర్యవేక్షకుడిగా పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్ పేరును మిక్కి ప్రతిపాదించగా ఎస్ జి ఎఫ్ నూతన జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిలుగా ప్రమాణ స్వీకారం చేసిన పత్స రామకృష్ణారావు, చిట్టిమళ్ళ శ్వేతా బ్రహ్మంచారి బలపర్చగా అందరూ ఆమోదం తెలిపారు. ఎస్ జిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జాతీయ అధ్యక్షుడు మ్యాక్ మిక్కి ప్రకటించారు.
ఐఎస్ జీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


